వి.ఆర్.పురం
భవిష్యత్ గ్యారెంటీ ఇది బాబు గ్యారెంటీ కార్యక్రమాన్ని, తెలుగుదేశం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం ఇంటింటికి చంద్రబాబు నాయుడు భవిష్యత్ గ్యారెంటీ అనే పోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా రేఖపల్లి బూత్ ఇంచార్జీ పెందుర్తి సుదర్శన రావు మాట్లాడుతూ తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే వారందరికీ ఒక్కరికీ సంత్సరానికి 15,000/-రూపాయలు ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. ప్రతీ రైతుకు ఏటా 20,000/-రూపాయలు ఇచ్చేందుకు తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇస్తుందని ఆయన చెప్పారు. ప్రతీ ఇంటికీ మంచినీటి పధకం క్రింద రక్షిత త్రాగునీరు అందిస్తామని స్పష్టంచేశారు. దీపం పేరుతో ప్రతీ ఇంటికీ ఏడాదికి ఉచితంగా3 గ్యాస్ సిలెండర్లు ఇస్తామని తెలిపారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత అధికారంలోకి వస్తే ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తారని ఆయన అన్నారు. ప్రతీ ఇంటికీ ఆన్లైన్ చేసి బాండ్ ఇవ్వడం జరుగుతుందని ఈ కార్యక్రమంతో తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సర్వే కార్యక్రమంలో టిడిపి ప్రధాన కార్యదర్శి బురకా కన్నారావు, నియోజకవర్గ వాణిజ్య విభాగం ఇంచార్జీ బీరక సూర్యప్రకాష్ రావు, పులి సాహెబ్,తదితరులు హాజరయ్యారు.