పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు
వాలంటీర్లకు పురస్కారాల అందజేత
పోలవరం:
ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు కితాబునిచ్చారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయం నందు శుక్రవారం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను గుర్తిస్తూ సేవ మిత్ర, సేవ రత్న ,సేవ వజ్ర పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా పాల్గొన్న ఎమ్మెల్యే బాలరాజు, నియోజకవర్గం వైసిపి ఇంచార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి, ఏలూరు పార్లమెంట్ ఇంచార్జ్ కారుమూరి సునిల్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్. జగన్మోహన్ రెడ్డి దేశంలో ఎక్కడ లేనివిధంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి చరిత్ర సృష్టించారని అన్నారు. వాలంటీర్లు ప్రజలకు మరింత మెరుగైన సేవలందించి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పారదర్శకంగా లబ్ధిదారులకు అందడానికి వాలంటీర్లు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని అన్నారు. అతి తక్కువ గౌరవ వేతనంతో విధులు నిర్వహిస్తున్న వాలంటీర్లను సమాజ హితులుగా ప్రతి ఒక్కరూ గుర్తించి, గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, జడ్పీటీసీ,మండల కన్వీనర్,వైస్ ఎంపీపీలు,సొసైటీ అధ్యక్షులు,స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, మార్కెట్ కమిటీ డైరెక్టర్,సర్పంచ్ లు, ఎంపీటీలు,వార్డు మెంబర్లు, అధికారులు,సచివాలయం సిబ్బంది,వాలంటీర్లు,నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు