మంత్రి పెద్దిరెడ్డిని కోరిన వీరభద్రాలయ చైర్మన్
లేపాక్షి :-ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరొందిన లేపాక్షి వీరభద్రాలయ అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కరణం రామానందన్ కోరారు. సోమవారం తిరుపతిలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యాలయంలో రామానందన్ కలిసి పుష్పగుచ్చాలను అందజేసి అభినందనలు తెలిపారు. తనకు ఆలయ చైర్మన్ గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి తో చైర్మన్ పలు విషయాలపై చర్చించారు. లేపాక్షి వీరభద్రాలయ అభివృద్ధికి వివిధ శాఖలను సహకరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డిని కోరారు. లేపాక్షి ఉత్సవాలను నిర్వహించాలని మంత్రికి తెలియజేశారు. అదేవిధంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన జటాయువు మోక్ష ఘాట్ పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, ఆ పనులకు సంబంధించి టీటీడీ నిధులను మంజూరు చేసిందన్నారు. ఆ పనులు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని లేపాక్షి వీరభద్రాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ కరణం రమానందన్ కోరారు.

