Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలురౌతులపూడి మండలంలోని స్థానిక ఎన్డీఏ కూటమి ఆఫీస్ నందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు...

రౌతులపూడి మండలంలోని స్థానిక ఎన్డీఏ కూటమి ఆఫీస్ నందు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్

రౌతులపూడి:రౌతులపూడి మండల హెడ్ కోటర్స్ నందు భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ ,ప్రత్తిపాడు నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ నాయకులు ఉమ్మిడి వెంకట్రావు, రౌతులపూడి మండల అధ్యక్షులు ఊటా శ్రీను, ఎక్స్ జడ్పిటిసి యాదగిరి వెంకటరమణ ఆధ్వర్యంలోని,ఎన్డీఏ బలపరిచినటువంటి కాకినాడ జనసేన పార్లమెంటు ఎంపీ అభ్యర్థి తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ మరియు ఎన్ డి ఏ భాగస్వామ్యం అయినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రత్తి పాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాని టీడీపి ,జనసేన ,బిజెపి,కూటమి అయినటువంటి అభ్యర్థులు కాకినాడ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థుల గెలుపు కోసం మీ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి చిలుకూరి రామ్ కుమార్ మాట్లాడుతూ ఎన్ డి ఏ అభివృద్ధి కార్యక్రమాలు గురించి దేశానికి చేసిన మోడీ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు గూర్చి మన కాకినాడ జిల్లాకు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతూ వివరించారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు ఉమ్మిడి వెంకట్రావు మాట్లాడుతూ దారిద్ర రేఖకు దిగువున ఉన్నటువంటి నిరుపేద ప్రజానీకానికి దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ స్ఫూర్తితో మారుమూల చిట్టచివరి వ్యక్తి ప్రయోజనo కోసం తిండి, గుడ్డ, గూడు, నీడ, ప్రధానమంత్రి కిసాన్ సమాధి యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన జల జీవన్ మిషన్ ,ఉజ్వల గ్యాస్ కలెక్షన్, అనేక ప్రజా రంజిక పథకాలు సంబంధించినది కార్యక్రమాలు గురించి ప్రస్తావించడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో భాగమైన ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరుపుల రాజా సత్య ప్రభ గెలుపునకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి సత్య ప్రభ గెలిపించుకోవాలని పత్రిక ముఖంగా తెలియజేయడమైనది ఈ యొక్క కార్యక్రమంలో పోతా బత్తుల పెదబాబు దొంతo శెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article