ఏఐటీయూసీ
కడప సిటీ
కడప రైల్వే స్టేషన్ లో గూడ్స్ షేడ్
హమాలీలు తమ సమస్యలు దీర్ఘకాలికంగా పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు పడుచున్నన్నారని తక్షణమే పరిష్కరించాలని సోమవారం కడప రైల్వే స్టేషన్ పరిశీలనకు వచ్చిన డిఆర్ఎమ్ విన్నీత్ సింగ్ కు రైల్వే గూడ్స్ హమాలీ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ )అధ్యక్ష కార్యదర్శులు కేసి.బాదుల్లా, ఎస్ మహబూబ్ బాషా లు వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హమాలి కార్మికులకు మౌలిక వసతులైన తాగునీరు, ఉపయోగించే ఫ్రిడ్జ్ చెడిపోవడంతో ప్రస్తుతం వేసవికాలం ప్రారంభం కావడంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారని,యూనియన్ కార్యాలయం పైన నీటి ట్యాంకు ఏర్పాటు చేసి ప్యూరిఫైడ్ ఫిల్టర్స్ బిగించాలని గత ఆరు నెలల ముందు డీఆర్ఎం కు విన్నవించిన నేటికి పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
యూనియన్ కార్యాలయం పక్కనే రైల్వే లైనుకు ఉపయోగించిన సిమెంటు (దిమ్మెలు)పొల్లు పక్కనే ఉంచడం మూలంగా వాటి క్రిందికి మురికి నీరు నిల్వ ఉండి పాములు, తేళ్లు తిరుగుచున్నాయని వాటిని తొలగించి స్కూటర్ పార్కింగ్ కొరకు షెడ్డు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
మరుగుదొడ్లు కూడా కార్యాలయం ఆవరణలో కాకుండా బయటకు తరలించి తగినన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రైల్వే గూడ్స్ షేడ్ హమాలి యూనియన్ నాయకులు పాల్, శ్రీను, చిన్న ఓబులేసు ,గంగయ్య, సుబ్బరామ్, సూరి ,మళ్లీ, రంగనాయకు లు పాల్గొన్నారు.