వి.ఆర్.పురం :ప్రభుత్వం రేషన్ కార్డు లబ్దిదారులకు అందిస్తున్న బియ్యం, పప్పు, పంచదార వంటి రేషన్ సరుకులను రేషన్ షాపు డీలర్లు సక్రమంగా పంపిణీ చేయాలనీ, స్థానిక తహశీల్దార్ ఎస్డి మౌలానా ఫాజిల్ అన్నారు. బుధవారం మండల రేషన్ షాపు డీలర్లతో తహశీల్దార్ తన ఛాంబర్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ షాపు డీలర్లు నిత్యవసర సరుకులు పంపిణీలో తూకాలలో తేడా రాకుండా, రేషన్ పంపిణీ చేయడం, మిడ్ డే మీల్స్ కు రేషన్ అందించడం తదితర పంపిణీ కార్యక్రమాలను సమయానుసారం చేయాలని ఆయన సూచించారు. ఈకార్య్రమంలో ఎం ఈ ఓ లక్ష్మీనారాయణ, ఆర్ఐ ఎం రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ రామయ్య, రేషన్ డీలర్లు భవాని, శారద, బుల్లెమ్మ, తిరుపతమ్మ, రాములమ్మ, రాంబాబు, రామారావు, సుబ్బారావు, రవి, మను, ప్రసాద్, సీతారామయ్య, పాపారావు తదితరులు పాల్గొన్నారు.

