Saturday, May 3, 2025

Creating liberating content

తాజా వార్తలురేపు విశాఖలో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్‌.. హాజరుకానున్న సీఎం జగన్‌

రేపు విశాఖలో ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్‌.. హాజరుకానున్న సీఎం జగన్‌

అమరావతి:రేపు విశాఖపట్నంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు తుది దశకు వచ్చాయి. గడిచిన నెల రోజులు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ క్రీడా సంబరాలను ప్రభుత్వం నిర్వహించింది. అక్కడ అద్భుత ప్రతిభ కనబర్చిన జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీలకు 26 జిల్లాలు నుంచి 260 జట్లు ఎంపికయ్యాయి. 130 మహిళల జట్లు, 130 పురుషుల జట్లు ఉన్నాయి. వీరికి విశాఖలోని ఎనిమిది మైదానాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9 నుంచి 13 వరకు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం జరగనున్న ఫైనల్‌ పోటీలకు సీఎం జగన్మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పీఎం పాలెంలోని ఏసీఏ వీడీసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న ఫైనల్‌ వేడుకల్లో సీఎం పాల్గొన్ని క్రీడాకారులు, ప్రేక్షకులను ఉద్ధేశించి ప్రసంగించనున్నారు. ఇందుకోసం అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.ఫైనల్‌ మ్యాచ్‌కు సీఎం జగన్ హాజరవుతున్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రద్యుమ్న అధికారులను ఆదేశించారు. ఆదివారం ఏసీఏ స్టేడియంతోపాటు హెలిప్యాడ్‌ ప్రాంతాలను పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలను జారీ చేశారు. అధికారులు సమన్వయంతో పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. పూర్తి స్థాయిలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా ముగిసేలా చూడాలన్నారు. విభాగాలు వారీగా చేపట్టాల్సిన చర్యలకు సంబంధించిన మార్గదర్శకాలను ఈ సందర్భంగా ఆయన జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article