రేపు విద్యుత్ అంతరానికి ప్రజల సహకరించాలి
- విద్యుత్ శాఖ ఏఈ శివప్రసాద్
- వరదయ్య పాలెం పంచాయతీ పరిధిలో రేపు 9 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేత
- తిరుపతి జిల్లా వరదయ్య పాలెం పంచాయతీ పరిధిలోని గ్రామాలకు 10వ తేదీ న ( రేపు) విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు స్థానిక విద్యుత్ శాఖ ఏఈ శివప్రసాద్ పేర్కొన్నారు.
- వరదయ్య పాలెం పంచాయతీ మరమ్మత్తు,విద్యుత్ పోల్స్ వద్ద చెట్లు తొలగింపు వంటి పనులకు గాను శనివారం ఉదయం 09 గంటల నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. దీన్ని గమనించి వినియోగదారులు విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.