నా మీద విపరీతమైన ఒత్తిడి ఉంది
తప్పు చేసిన వారిని తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు
ప్రజాభూమి ప్రతినిధి – తిరుపతి
గతంలో పరకామణిలో జరిగిన 100 కోట్లు అవినీతి పైన గతంలో మీడియా ముందు నేను లేవరెత్తిన అక్రమాల పైన ప్రెస్ మీట్స్ పెట్టవద్దు అంటూ వ్యక్తిగతంగా ఒత్తిడి తెస్తూ నన్ను టార్గెట్ చేస్తూ చేస్తున్నారు. అని కన్నీరు మున్నీరైనా భాను ప్రకాష్ రెడ్డి. మీడియాతో మాట్లాడుతూ” భాను ప్రకాష్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా స్వామి వారి చెంత భక్తి శ్రద్ధలతో అంకిత భావంతో పనిచేస్తున్నాను అక్కడ జరిగే అక్రమాలు, అన్యాయాలను స్వామి వారి భక్తుడిగా కాపలా దారుడిగా కుక్క లాగ స్వామి వారికి నేను సేవ చేస్తూ అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలను తప్పులను ప్రశ్నిస్తూ పని చేస్తున్న అంతే తప్ప వ్యక్తిగతంగా నాకు ఎవరిపైన ఎటువంటి కోపాలు గాని ద్వేషాలు గాని లేవు. వ్యక్తిగతంగా నేనెవరికీ శత్రువుని కాదు. కావాలనే నా ఎదుగుదలను ఓర్వలేక నన్ను మానసికంగా నా పైన సోషల్ మీడియాలో పోస్టింగ్లు వీడియోలు పెడుతూ మానసికంగా ఒత్తిడి తెస్తూ ఈ కేసును వదిలేయాలి. ప్రెస్ మీట్స్ పెట్టొద్దు అంటూ నా పైన ఒత్తిడి తెస్తూ నన్ను టార్గెట్ చేస్తున్నారు అని కన్నీరు పెట్టుకున్నారు. దేవదేవుడు వెంకటేశ్వర స్వామి పైన నాకు ఉన్నటువంటి భక్తి, అంకితభావం తోనే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు పైన పోరాడాలని కోట్ల మందిలో నాకు ఆ దేవదేవుడు అవకాశం ఇచ్చాడు అందువలనే అన్యాయాలు పైన పోరాటం చేస్తున్నాను తప్ప నాకు ఎటువంటి వ్యక్తిగతంగా ఎవరిపైన కక్షలు లేవు. నేను నమ్మే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా కోరుకుంటున్నా ఆ స్వామి వారి అనుగ్రహంతో ఈ కేసులో ఎవరెవరు దోషులు ఉన్నారో వాళ్లందరినీ దోషులుగా నిలబెట్టాలని పెద్ద వాళ్ళందరూ ఈ సంఘటన పైన సుదీర్ఘంగా విచారణ చేపట్టి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో దోషులను దోషుగా నిలబెట్టాలని తప్పు చేసిన వారిని తప్పకుండా దేవుడు శిక్షిస్తాడని కోరుకుంటున్నాన”ని భాను ప్రకాష్ రెడ్డి చెప్పుకొచ్చారు.

