Monday, September 15, 2025

Creating liberating content

తాజా వార్తలురూ.2500 కోట్లతో కడప నగరాభివృద్ధి

రూ.2500 కోట్లతో కడప నగరాభివృద్ధి

అమరజీవి పొట్టి శ్రీరాములు15 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్ బి అంజాద్ భాష,

నగర మేయర్ కే సురేష్ బాబు

ప్రజా భూమి కడప బ్యూరో

ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 15 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణ మా అదృష్టంగా భావిస్తున్నాము అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎస్ బి అంజాద్ భాష, నగర మేయర్ కే సురేష్ బాబు,ఎమ్మెల్సీ ఎం రామచంద్రారెడ్డి సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం స్థానిక గోకుల్ సర్కిల్ వద్ద 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ రావు ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర పితామహుడు జీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమంరాష్ట్ర ఉపముఖ్యమంత్రి మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎస్ బి అంజాద్ భాష, నగర మేయర్ కే సురేష్ బాబు,ఎమ్మెల్సీ ఎం రామచంద్రారెడ్డి ల చేతుల మీదుగా జరిగింది.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి. అంజాద్ భాష మాట్లాడుతూ… ఈరోజు ఎంతో శుభదినం దినం, పండుగ రోజు అని కూడా చెప్పవచ్చునని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర పితామహుడు జీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నాయకులు, వైశ్య సోదర సోదరీమణులు పాల్గొనడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. కడప నగరాభివృద్ధిలో భాగంగా ఎన్నడూ లేని విధంగా ఎవరు ఆలోచించలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కడప నగర రూపురేఖలు మార్చే అంశంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. గతంలో పాతగా మనం అనుకునే గోకుల్ సర్కిల్ ను ఆ సర్కిల్ వద్ద 15 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ప్రతిష్టించడం జరిగిందని అలాగే ప్రారంభించుకోవడం కూడా జరిగిందని అన్నారు. ఈరోజు నుండి ఈ సర్కిల్ పేరు కూడా అమరజీవి పొట్టి శ్రీరాములు సర్కిల్ అని కూడా నామకరణం చేయడం జరిగిందన్నారు. గతంలో సినిమా థియేటర్ల పేరుతో సర్కిళ్లను పిలిచే వారమని, ఇలాంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆ సర్కిల్లో కూడలులను ఆ మహోన్నతమైన వ్యక్తుల పేర్లతో పిలవడం జరగాలని రాబోవు రోజుల్లో కూడా మహోన్నతమైన వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి వారి పేరుతో సర్కిళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.
గతంలో ఎవరు కడప నగర అభివృద్ధికి నోచుకోలేదని, గత పాలకులు విస్మరించడం జరిగిందని అన్నారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వచ్చిన సందర్భంలో కడప నగరం కొంత అభివృద్ధి చందడం జరిగిందని అన్నారు. తర్వాత వచ్చిన పాలకులు పూర్తిగా విస్మరించడం జరిగిందని అన్నారు. అందరి ఆశీస్సులతో జిల్లావాసి జిల్లా ముద్దుబిడ్డ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చేయు ఆలోచనతో నగరాన్ని రూ 2500 కోట్లు తో అభివృద్ధి చేయడం జరుగుతోందని చెప్పారు. 16 రోడ్లు కార్యక్రమాన్ని తాను, మేయర్ కే సురేష్ బాబు, ఎంపీ అవినాష్ రెడ్డి లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపాదించగా అందులో ఏడు రోడ్లు ముఖ్యమైనవి గుర్తించాలని చెప్పడం జరిగిందని అందులో ముఖ్యమైన ఏడు రోడ్లను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి కి నివేదించడం జరిగిందని చెప్పారు. ఆ ఏడు రోడ్లను రూ 450 కోట్ల రూపాయలతో విస్తరణ కార్యక్రమం చేపట్టి ప్రస్తుతం 80 నుండి 90 శాతం పూర్తి అయిందన్నారు. కడప నగరంలో ఎవరు ఆలోచన చేయలేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అతి సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతోందని అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని రాబోవు రోజుల్లో మరి ముఖ్యమంత్రిగా ఉండేందుకు ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని అన్నారు.
నగర మేయర్ కె. సురేష్ బాబు మాట్లాడుతూ.. గతంలో ఎన్నడు లేని విధంగా కడప నగరాన్ని రూ 2500 కోట్లు తో అభివృద్ధి చేయడం జరుగుతోందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత అభివృద్ధి జరగలేదని ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. కడప నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, క్యాన్సర్ హాస్పిటల్, కంటి హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని అలాగే అనేక అభివృద్ధి కార్యక్రమాలను నగరంలో జరుగుతోండడం మన అదృష్టంగా భావించాలని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నీ మరి మరి ఆశీర్వదించి మరలా ముఖ్యమంత్రిగా చేసుకుంటే చెప్పలేనటువంటి అభివృద్ధి జరుగుతుందని చెప్పారు.
ఎమ్మెల్సీ ఎం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ సంక్షేమాన్ని అభివృద్ధిని గమనించి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని చెప్పారు. తొలుత ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు 15 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎస్.బి. అంజాద్ భాష, నగర మేయర్ కే సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎం రామచంద్రారెడ్డి ల చేతుల మీదుగా ఆవిష్కరించి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, కార్పొరేటర్లు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాకేష్ చంద్ర, ఆర్యవైశ్య సంఘం గుప్ప చంద్రశేఖర్, మునగ శ్రీనివాసులు యనమల రమణయ్య, ముల్లంగి కృష్ణమూర్తి, పలుకు సుబ్బరాయుడు, నాయకులు నారపురెడ్డి సుబ్బారెడ్డి, తోట కృష్ణ, జయచంద్ర రెడ్డి, సుభాన్ భాష, పస్తం అంజి, సిహెచ్ సునీల్ కుమార్, అబ్దుల్ రౌఫ్, నాయకురాలు టీవీ సుబ్బమ్మ, నసీమా సుల్తాన్, ఆర్యవైశ్య సోదరీ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article