ఇర్రిపాక లో జరిగే కోటి పార్టీవలింగ రుద్రాభిషేకం కు చంద్రబాబును ఆహ్వానించిన జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట
జగ్గంపేట మండలం ఇర్రిపాకలో జ్యోతుల నెహ్రూ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి పార్థివ లింగ రుద్రాభిషేకం (మట్టి శివలింగాలు) కు జాతీయ టిడిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుని శనివారం అమరావతిలో గల చంద్రబాబు నాయుడు స్వగృహంలో కలిసి ఆహ్వాన పత్రం అందించి ఆహ్వానించిన రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ, ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ మా స్వగ్రామం ఇర్రిపాకలో నిర్వహించే ఫిబ్రవరి 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు భారతదేశంలో ఎక్కడ నిర్వహించనునటువంటి కోటి పార్థివలింగాలతో కోటి పార్థివలింగ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి మా నాయకులు చంద్రబాబు కి ఆహ్వాన పత్రం అందించి 11 రోజుల్లో ఏదో ఒక రోజు రావాలని కోరడం జరిగిందని అన్నారు. చంద్రబాబు నాయుడు మహా కుంభాభిషేకానికి సంబంధించిన ఆల్బమ్ అంతా చూసి మంచి దైవ కార్యక్రమం చేస్తున్నావని నెహ్రూని అభినందించారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం రిటైర్డ్ పి ఆర్ ఓ తులాల రాముడు తదితరులు పాల్గొన్నారు