బ్యాలెట్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ గురించి జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి
ప్రజాభూమి బ్యూరో, అనంతపురము
ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమంలో రిజెక్ట్ అయిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ లను బెల్ కంపెనీకి త్వరలో తిరిగి పంపిస్తామని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. శనివారం అనంతపురం నగరంలోని పాత ఆర్డీఓ కార్యాలయం కాంపౌండ్ లో ఉన్న ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అక్టోబర్ 16వ తేదీ నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఈవీఎంలు, వీవీ ప్యాట్స్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఇందులో 89 బ్యాలెట్ యూనిట్స్, 82 కంట్రోల్ యూనిట్స్, 218 వీవీ ప్యాట్స్ లు ఫస్ట్ లెవెల్ చెకింగ్ కార్యక్రమంలో రిజెక్ట్ యూనిట్స్ ఉన్నాయని తెలిపారు. రిజెక్ట్ అయిన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ లను స్కాన్ చేసి బెల్ కంపెనీకి పోలీస్ బందోబస్తుతో తిరిగి పంపించడం జరుగుతుందన్నారు. గోడౌన్ లో పటిష్ట బందోబస్తుతో ఈవీఎంలను భద్రపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్రంధి వెంకటేష్, తహసీల్దార్ బాలకిషన్, ఎన్నికల విభాగం డిప్యూటీ తహసిల్దార్ కనకరాజు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి మసూద్ వలి, కాంగ్రెస్ ప్రతినిధి ఎంఎండి.ఇమాం వలి, శర్మాస్, వైఎస్సార్ సిపి ప్రతినిధి శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.