Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలురాష్ట్రంలో మళ్లీ జగనన్న ప్రభుత్వమే అధికారంలోకి

రాష్ట్రంలో మళ్లీ జగనన్న ప్రభుత్వమే అధికారంలోకి

సంక్షేమ పాలకుని ఆశీర్వదించండి

జగనన్నను, అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపిద్దాం

ఎన్నికల ప్రచారంలో వైఎస్ సమతా రెడ్డి, వైయస్ శ్వేతా రెడ్డి

పులివెందుల
రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని,సంక్షేమ పాలకుని ప్రజలు ఆశీర్వదించా లని, సంక్షేమ పాలన జగన్ తోనే సాధ్యమని,నవర త్న పథకాలు మళ్లీ అందాలంటే జగనన్న ను మళ్లీ ముఖ్యమంత్రి చేసుకోవాలని, జగనన్న పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలుఅందాయ ని జగనన్నను అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని,ఎన్నికల ప్రచారంలో వైయస్ సమతా రెడ్డి, వైయస్ శ్వేతారెడ్డి లు పేర్కొన్నారు. శనివారంపులివెందుల పట్టణంలో రాజీవ్ గాంధీ కాలనీ,రాజారెడ్డి కాలనీలో మహిళలతో కలసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి జగన్మోహన్ రెడ్డిని అవినాష్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు మేలు జరిగే విధంగా జగన్ మేనిఫెస్టో వదలడం జరిగిందన్నారు.వృద్ధుల కు 3500 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో టిడిపి కూటమిని ప్రజలు నమ్మే పరిస్థి తిలో లేరని, వారు చెప్పే మాయమాటలు ఎవరు నమ్మవద్దని వారన్నారు. 14 సంవత్సరాల లో రాష్ట్రంలో ఏమి చేయలేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారం కోసం లేనిపోని హామీలన్నీ ఇస్తున్నారని వారన్నారు.జగన్మోహన్ రెడ్డి పాలన లో రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మళ్లీ ఆయనను ముఖ్యమంత్రి చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని మళ్లీముఖ్యమంత్రి చేసుకునేందుకు ఎన్నికల కోసం వేచి ఉన్నారన్నా రు. ఎన్ని పార్టీలు ఏకమై వచ్చిన రాష్ట్ర ప్రజలు జగన్ వైపు ఉన్నారన్నారు. ఎల్లో మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాలు నమ్మవద్దని కూడా వార న్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article