అంచనాలు కొండంత.. ఖర్చులు గోరంత
పులివెందుల
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడి తప్ప.. రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదని పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ వేలూరు శ్రీనివాసులు రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అయిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి గారడితో మాయ మాటలు చెప్పారని ఆయన ఆరోపించారు. రూ.13వేల కోట్ల రెవెన్యూ లోటును రూ.44వేల కోట్లకు, రూ.35వేల కోట్ల ద్రవ్యలోటును రూ’60 వేల కోట్లకు పెంచిన ఘనత బుగ్గనదేనని అన్నారు. పన్నుల బాదుడు తప్ప బడ్జెట్ లో కొత్త అంశాలు ఏమీ లేవు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ అప్పులు రూ.11.58 లక్షల కోట్లు, వైకాపా ప్రభుత్వంలో రాష్ట్ర అప్పుల పాలు అయిపోయిందన్నారు. ఏపీ అప్పులు రెట్టింపు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ప్రతీ స్కీము ఓ స్కామ్ గా మారింది అన్నారు. వైసీపీ పాలనలో సామాన్యుడు బతకాలంటే చాలా కష్టంగా ఉందన్నారు. వితౌసర సరుకులు విపరీతమైన ధరలు పెరగడంతో సామాన్యుడు తినే దాన్ని కూడా ఇబ్బందులు పడుతున్నారన్నారు. నిత్యవసర సరుకులు ధరలు తగ్గాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆయన అన్నారు. ఏపీ ప్రజలు షర్మిల అక్క రావడంతో కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాజన్న ఆశయాలు నెరవేర్చేందుకే వైయస్. షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిందన్నారు