బుట్టాయగూడెం.శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ రామాలయాల వద్ద ప్రసాదంగా అందించే పానకం కు కావలసిన బెల్లం తదితర సరంభాలను తపన ఫౌండేషన్ అధినేత గారపాటి సీతారామాంజనేయ చౌదరి (తపన చౌదరి) అందించారు.
పోలవరం నియోజకవర్గం బిజెపి కన్వీనర్ కొండేపాటి రామకృష్ణ మంగళవారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీతారామాంజనేయ చౌదరి శ్రీరామ నవమి సందర్భంగా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం లోని 35 మండలాలకు పానకం తయారీకి కావలసిన సామాగ్రిని వితరణ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయా మండలాలలోని ప్రతి దళిత వాడలోని రామాలయానికి పానకం తయారీకి అవసరమైన బెల్లం, మిరియాలు, యాలకులు, తదితర సామాగ్రిని పంపిణీ చేసినట్లు చెప్పారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రజలందరూ ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. బుట్టాయిగూడెం మండలానికి చేరిన పానకం సామాగ్రిని బిజెపి నేతలు వంకా కాంచనమాల, దొమ్మేటి లక్ష్మీ జనార్దన్ రావు, బిజెపి కార్యకర్తలు ఆయా ఆలయాలకు అందించారని రామకృష్ణ తెలిపారు.