గొల్లప్రోలు
గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పుష్య పౌర్ణమి, పుష్యమి నక్షత్రం కలసి రావడం తో గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు,దత్తు సోదరులు శ్రీ సూక్త, దుర్గాసూక్త విధానంగా పూజలు చేశారు. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనే, పంచదార, చెరుకు రసము, పళ్ళ రసములు, విభూధి గంధము,పసుపు,కుంకుమ సుగంధ జలాలు, వట్టివేర్లు, రోజ్ వాటర్ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ సేవాసమితి సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు.