గొల్లప్రోలు
గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలోని రామలింగేశ్వర ఆలయంలో శుక్రవారం రథసప్తమి సందర్భంగా సూర్య నారాయణమూర్తికి విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు సోదరులు గర్భాలయంలో ఉన్న స్వామికి పంచామృత అభిషేకాలు చేశారు.శివాలయ ప్రాంగణంలో ఏరు పిడకలు దాలి పేర్చి సూర్యునికి ఎదురుగుండా పాలు పొంగించారు.ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణ స్వామి వారికి పొంగలి నివేదన చేశారు. పాలకొల్లు వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గణపతి శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక సూర్య యంత్రముతో సౌరము, అరుణ పారాయణ చేసి సూర్య హోమం జరిపించారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.