ప్రొద్దుటూరు :భూకబ్జాలు, మట్కా బిజినెస్, గుట్కా వ్యాపారము చేసి ఉంటే తనకు ప్రొద్దుటూరు రాబోయే ఎన్నికల లో ఓటర్లు ఓటు వేయొద్దని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రకటించినట్లే ఓటు వేయకుండా నియోజకవర్గ ఓటర్లు బుద్ధి చెప్తారని, గుణపాఠం నేర్పిస్తారని మాజీ శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశం లో మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు, ప్రతి వీధికి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అక్రమ దందాలు తెలుసని అన్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన అన్న కిరణ్ రెడ్డి అక్రమంగా వెయ్యికోట్ల సంపాదన కూడ పెట్టుకుంటే, రాచమల్లు బావ మరిది బంగారు రెడ్డి 250 కోట్లు అక్రమంగా సంపాదన మూట కట్టుకున్నారు అన్నారు . ఎం పి పి శేఖర్ యాదవ్ కూడా వంద కోట్లు అక్రమంగా సంపాదించారు అంటేనే ఎమ్మెల్యే రాచమల్లు అవినీతి దందా ఎంత ఉందో తెలుస్తుంది అన్నారు.ఇదంతా ప్రజల నుంచి అక్రమంగా దోచుకున్న డబ్బే అన్నారు. గుట్కా తీసుకుని,అమ్మిస్తు ప్రజల ఆరోగ్యంతో ఎమ్మెల్యే ఆట్లాడుకుంటున్నాడని విమర్శించారు. విదేశాలకు ప్రత్యేక విమానాల్లో క్రికెట్ జూదగాల్లను తీసుకువెళ్లిన ఘన చరిత్ర నీది కాదా ఆని ప్రశ్నించారు. దొంగ నోట్లు బి డైరెక్టర్ రజిని మారుస్తూ పరాయి రాష్ట్రంలో పట్టుబడిన మహిళ నీ అనుచరురాలు కాదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు దొంగతనంగా మార్చుకున్నది నీ మనసులు కాదా అని ప్రశ్నించారు. ఎన్నికలలో ఎదుర్కోవడం చేతకాక తన వయసు గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. రాజకీయాల్లో రిటైర్మెంట్లు ఉండవని, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్లు మానుకోవాలి కానీ వయసుతో సంబంధం లేదని అన్నారు. తమ అధినేత చంద్రబాబు నాయుడు తన మీద నమ్మకంతో తనకు టికెట్ ఇచ్చారని నీవు ఇప్పించలేదని గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రజల్లో తనకున్న ఆదరణను చూసి ఓర్చుకోలేక ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అవాకులు, చెవాకులు పేళ్తున్నాడని అన్నారు. రాచమల్లుకు ఓటు వేయకుండా ప్రొద్దుటూరు ఓటర్లు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపిస్తారని అప్పుడు రాచమల్లుకు బుద్ధి వస్తుందని అన్నారు. ఈ సమావేశం లో కౌన్సిలర్ మహమ్మద్ గౌస్,మున్నా,గంటాసాల వెంకటేశ్వర్లు, కొర్రపాడు రామచంద్రా రెడ్డి, జనసేన నాయకులు సుంకర మురళీ తదితరులు పాల్గొన్నారు.