రాప్తాడు ;
రాప్తాడు నూతన సిఐగా డి. మునిస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ బదిలీల్లో భాగంగా చిత్తూరు జిల్లా నుండి అనంతపురం రాప్తాడు స్టేషన్ కి బదిలీపై వచ్చానని మండలంలోని జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు కృషి చేస్తానని , అదేవిధంగా అన్ని గ్రామాల్లో, ప్రత్యేకంగా ఫ్యాక్షన్ గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తానని , గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా మండల ప్రజల సహకరించాలని తెలిపారు . ఈ సందర్భంగా నూతన సిఐకు స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలియజేశారు.