- పలు కుటుంబాలు టిడిపిలో చేరిక
- టిడిపి ఇంచార్జ్ బీటెక్ రవి
వేంపల్లె
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఘన విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో రానున్నది టిడిపి ప్రభుత్వమేనని ఆ పార్టీ ఇంచార్జీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక మేదర వీధిలోని పలు ముస్లిం కుటుంబాలు టిడిపి మండల అధ్యక్షుడు రామమునిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఆధ్వర్యంలో టిడిపిలోకి చేరాయి. ఈ సందర్భంగా ఆ కుటుంబాలను బిటెక్ రవి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టిడిపి అధినేత చంద్రబాబు బిజెపి నేతలతో కలిశారని, ఒక ఛానల్ లో విషప్రచారం చేశారని..కానీ ఇక్కడ అనేక మంది ముస్లిం కుటుంబాలు టిడిపిలోకి చేరాయన్నారు. చంద్రబాబు బిజెపితో కలిస్తే ముస్లింలు ఎందుకు పార్టీకి దూరమవుతారని ఆయన ప్రశ్నించారు. 2014-19 ఐదేళ్ల టిడిపి పాలనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ముస్లింల మనోభావాలు దెబ్బతినకుండా చంద్రబాబు కాపాడాలేదా! అన్నారు. అలాగే ముస్లింల సంక్షేమానికి దుల్హన్, రంజాన్ తోఫా, మసీదు మరమ్మతుల కోసం నిధులు, మౌజన్ లకు గౌరవవేతనం, విదేశీవిద్య తదితర పథకాలు అమలు చేశారన్నారు. బిజెపితో టిడిపి కలిస్తే ముస్లింలు దూరమవుతారనే ఎలాంటి అపోహలు లేవన్నారు. అందుకు నిదర్శనం నేడు వేంపల్లె పట్టణంలోనీ ముస్లిం సోదరులు, సోదరిమణులు టిడిపిలోకి చేరడమైందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నేతలు మహమ్మద్ షబ్బీర్, నిమ్మకాయల మహమ్మద్ దర్బార్, ఎస్పి జయచంద్రారెడ్డి, డివి సుబ్బారెడ్డి, పాపిరెడ్డి, రాజన్న, దొంతు సుబ్బారావు, పట్టణాధ్యక్షుడు ఆర్వి రమేష్, మండల ఉపాధ్యక్షుడు వీరభద్ర, మైనారిటీ అధ్యక్షుడు తెలంగాణవలి, ఎస్టీ నాయకులు రవికుమార్, రామాంజనేయ రెడ్డి, మహబూబ్ షరీఫ్, మడక శ్రీనివాసులు, వేమకుమార్, డక్కారమేష్ తదితర టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.