అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయనున్న ముగ్గురి పేర్లను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి పేర్లను వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. రాజ్యసభ పోలింగ్ కు తమను ఎంపిక చేయడంతో ఈ ము్గురు అభ్యర్థులు సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. అయితే ఈ నెల 27న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ముగ్గురు అభ్యర్థులు రాజ్యసభ నుండి రిటైర్ కానున్నారు.దీంతో మూడు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. టీడీపీకి చెందిన కనకమేడల రవీంద్రకుమార్, బీజేపీకి చెందిన సీఎం రమేష్, వైఎస్ఆర్సీపీకి చెందిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రిటైర్ కానున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలుగు దేశం పార్టీ భావిస్తుంది. తెలుగు దేశం పార్టీ తరపున కంభంపాటి రామ్మోహన్ రావు బరిలోకి దిగే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.