రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “సలార్” తో తాను సెన్సేషనల్ కం బ్యాక్ ని ఇవ్వగా ఈ చిత్రం తర్వాత తన నుంచి రానున్న ఇతర చిత్రాలపై మరిన్ని సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు మారుతీతో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ “రాజా సాబ్” కూడా ఒకటి. మరి దీనిపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాపై ఆ మధ్య కొన్ని లీక్ లు బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.వాటిలో ఓ ఫైట్ సీక్వెన్స్ లోని పిక్ కూడా బాగా వైరల్ అయ్యింది. అయితే ఇది మళ్ళీ వైరల్ గా మారగా దీనిపై మారుతి క్లోజ్ ఫ్రెండ్ అండ్ హిట్ నిర్మాత అయినటువంటి ఎస్ కే ఎన్ అయితే క్లారిటీ ఇచ్చాడు. ఇది అందరూ అనుకుంటున్నటుగా రాజా సాబ్ లోనిది కాదని తెలిపాడు. దీనితో రాజా సాబ్ నుంచి అయితే ఎలాంటి యాక్షన్ సీన్ సంబంధిత సీన్స్ లీక్ కాలేదనే క్లారిటీ ఇచ్చారు.