కడప నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి రెడ్డప్ప గారి మాధవి
కడప సిటీ
రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో, జగన్ వెన్నులో సలి చెమటలు పుట్టినవిఅన్నారు. ఇది వైసీపీకి చెంప పెట్టని కడప నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ రెడ్డప్ప గారి మాధవి శుక్రవారం పేర్కొన్నారు. రైతులపై తీసిన సినిమాలు అడ్డుకునే దీనస్థితికి జగన్ ప్రభుత్వం దిగజారింది అన్నారు. అమరావతి రైతుల త్యాగాలను, 75% పూర్తయిన రాజధాని నిర్మాణాన్ని, రాష్ట్ర అభివృద్ధిని నిర్వీర్యం చేసిన జగన్, సినిమాతో అమరావతి రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన దారుణాలు వెలుగులోకి వస్తాయనే భయంతో సినిమా ను అడ్డుకునే స్థితికి జగన్ దిగజారారని అన్నారు. నిన్నటిదాకా మూడు రాజధానులు అన్న జగన్, నేడు హైదరాబాద్ రాజధాని అంటూ మాట దాట వేస్తున్నారని ఆమె జగన్ మూడు రాజదానుల ప్రస్తావనను గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో జగన్ అమరావతి రైతులను ఉద్యమ బాట పట్టించారని, 34 వేల మంది రైతుల త్యాగాలకు వాస్తవ రూపం ఈ సినిమా అన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ ను నిలబెట్టిన జగన్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు.