ప్రజాభూమి పోరుమామిళ్ల:
పోరుమామిళ్ల మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీదేవి అనే మహిళ పోరుమామిల్లలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నందు జ్వరంతో చేరగా రక్త కణాలు తగ్గాయని, వైద్య సిబ్బంది ఏ పాజిటివ్ రక్తం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలుపగా పేషెంట్ తాలూకా బంధుమిత్రులు రక్తం కోసం ప్రయత్నం చేయగా చివరి క్షణాల్లో రైట్ హ్యాండ్ చారిటబుల్ ట్రస్ట్ ను సంప్రదించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు నాయబ్ రసూల్ స్పందించి పోరుమామిళ్లకు చెందిన ఖాజాచే ఏ పాజిటివ్ రక్తం అత్యవసరంగా రక్త దానం చేపించారు.ఈ సందర్బంగా సంస్థ పౌండర్ రసూల్, ప్రసాద్ లు అడిగిన వెంటనే , రక్త దానం చేసినదుకు డోనార్ ను అభినందిస్తూ రక్త దానం చేయాలనే ఉత్సాహవంతులు దయచేసి స్వచ్ఛంద సేవకులు మాలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలకు చేయూతనిచ్చి అత్యవసర పరిస్థితిలో రక్తమందక కొట్టుమిట్టలాడుతున్న రోగుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ఎవరికైనా అత్యవసరంగా రక్తం కావాలనుకుంటే 8125991900,వాట్స్ అప్ నంబర్ కి మెసేజ్ చేయాలని తెలిపారు.