నియోజకవర్గఅభివృద్దిపై చర్చ
తుని :మకుటుంలేని రారాజులు
ఆ ఇద్దరు నేతలు.తుని నియోజకవర్గ దశ దిశా నిర్ధేశించిన
మార్గదర్శకులు.సుదీర్ఘకాలంగా నియోజకవర్గాన్ని ఏలిన ఈ నేతలుఇద్దరూ రాజకీయ దాయాదులే
అయినా రాజకీయ కుట్రలు,కుతంత్రాలు,మచ్చుకయినా
కనిపించవు.వివక్షత లేని రాజకీయాలు నడిపారు కాబట్టే చెక్కుచెదరని ప్రజాభిమానం
ఈరెండు కుటుంబాల సొంతం.
మధ్యలో వచ్చిన వారిని మధ్యలోనే
తెరవెనక్కి పంపించేశారూ ప్రజలు.
అన్నట్టు ఇంతకీ ఆ ఇద్దరు నేతలు ఎవరనుకుంటున్నారు.వీరే యనమల రామకృష్ణుడు,రాజా అశోక్ బాబు.వీరిలో యనమల శాంతి స్వభావులు.రాజా అశోక్ బాబు ఉన్నది ఉన్నట్టుగా ముఖంపై కుండబద్దలు కొట్టే తత్వం.అందుచేతనే ఈ నేతలకు ప్రజాభిమానం కొండంత.అధికారం ఉన్నా,లేకున్నా యనమల రామకృష్ణుడు, రాజా అశోక్ బాబు
ప్రజాభిమానం ఉన్న నేతలు.అరమరికలు లేని రాజకీయాలే వీరిని.ఎన్నికల్లో గెలుపు కోసం సాంప్రదాయాల పద్దతిలో పోటీ పడినట్టే నియోజకవర్గ అభివృద్ధిలో
అదే పోటీ చూపారే తప్పా రాజకీయ ఆరోపణలకు ఎప్పుడూ చోటివ్వలేదు.ఇలాంటి నేతల భేటీ నియోజకవర్గ భవిష్యత్తుకు మార్గ నిర్దేశం అవుతుందని టాక్ నడుస్తోంది.సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా దుష్ట పాలనను తరిమి కొట్టేందుకు జనసేన నేతగా మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య
గెలుపులో కీలకపాత్ర పోషించారు.దివ్య గెలుపునకు సహకరించిన రాజా అశోక్ బాబు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు కృతజ్ఞతలు తెలిపారు.స్వయంగా
యనమల రామకృష్ణుడు…రాజా అశోక్ బాబు నివాసానికి వెళ్ళారు.
తన ఇంటికి విచ్చేసిన యనమలకు
ఎదురెళ్ళిన రాజా అశోక్ బాబు
మర్యాద పూర్వకంగా ఆహ్వానం పలికారు.ఇద్దరు నేతలు ఏకాంతంగా కొద్ది సేపు ముచ్ఛటించుకున్నారు.నియోజక
వర్గ అభివృద్ధిపై ఇద్దరు నేతలు
చర్చించుకున్నట్టు సమాచారం

