కొత్త కథలు, డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇప్పుడు ఆడియెన్స్‌ను బాగా మెప్పించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా భారీగా తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం అలాంటి ఓ డిఫరెంట్ కంటెంట్ మూవీ తోనే మన ముందుకు రాబోతున్నారు అజయ్ ఘోష్. చాందినీ చౌదరి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలుగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ అనే చిత్రం రాబోతోంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద.. హర్ష గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు ఈ సినిమా మేకర్స్. ఇందులో అజయ్ ఘోష్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ గమనిస్తుంటే అజయ్ ఘోష్ పాత్ర ఇందులో పూర్తి వినోదాత్మకంగా ఉండేలా అనిపిస్తోంది. కాగా ఈ పోస్టర్లో చాందిని చౌదరి పాత్రకు సంబంధించిన ఫోటో ని కూడా రిలీజ్ చేశారు. ఈ హీరోయిన్ ఈ పోస్టర్లో ఎంతో పద్ధతిగా.. చక్కగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ చూసిన దగ్గర నుంచి చాందినీ చౌదరి పాత్రకు, అజయ్ ఘోష్ కారెక్టర్‌కు ఉండే కనెక్షన్ ఏంటి? అసలు ఈ సినిమా పాయింట్ ఏంటి? వీరిద్దరి కథ ఏంటి? అనే ఆసక్తి ప్రేక్షకులలో ఏర్పడింది. అయితే ఈ ప్రశ్నలకు జవాబులు తెలియాలి అంతే మాత్రం ఈ సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
ఈ చిత్రానికి పవన్ సంగీతాన్ని అందించగా శ్రీనివాస్ బెజుగమ్ కెమెరామెన్‌గా పని చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా పని చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్.. అలానే ఈ సినిమా విడుదల చేయండి మేకర్లు ప్రకటించనున్నారు.