చంద్రగిరి
కర్ణాటకలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్త గలి జీవోత్తమ మఠమునకు చెందిన పరమ పూజ్య శ్రీమద్ విద్యాధీశ తీర్థ శ్రీపాద వడేర్ స్వామి గురువారం మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారు విద్యార్థులనుద్దేశించి సందేశం మిచ్చారు. ఎన్నో విద్యాలయాలను సందర్శించాను కానీ తిరుమల క్షేత్రములో స్వామి వారి చెంత వెలసిన మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని సందర్శించడంనాకు చాలా సంతోషంగా ఉందన్నారు. భగవంతుని అనుగ్రహం ఉంటే ఏదైనా సాధించ వచ్చని మోహన్ బాబు ఈ విశ్వవిద్యాలయం ద్వారా రుజువు చేశారు. విద్యావంతుడైనవాడు ఇంటిలో పట్టణంలో దేశం లోనిగాక ప్రపంచమంతా పూజింపబడుతాడు. మోహన్ బాబు యూనివర్సిటీలోని విద్యార్థులు ప్రపంచమంతా పూజింపబడుతారని నేను నమ్ముతున్నాను. అటువంటి వాతావరణం నాకు ఎం బి యు లో కనిపించిందని సందేశం ఇచ్చారు. అనంతరంఎం బి యు ఛాన్సలర్ మోహన్ బాబు మాట్లాడుతూ భక్తికి విద్యకు దగ్గర సంబంధముందన్నారు.
అందుకే స్వామివారువిద్యకుసంబంధించినఅనేక విషయాలనుమనకు తెలియజేశారనివారికిధన్యవాదాలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో ఎంబీయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య నాగరాజ రామారావు, రిజిస్టార్ ఆచార్య కే .సారథి, డీన్లు, ప్రిన్సిపాల్స్ , అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.