టి.నరసాపురం.
మండలం లోని రాజుపోతేపల్లి గ్రామంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు నల్లూరి వెంకట చలపతి రావు ఆధ్వర్యంలో నల్లూరి వెంకటేశ్వరరావుతో పాటు 50 కుటుంబాలు వైసిపి నుండి టిడిపిలో గురువారం చేరారు.టిడిపి పోలవరం నియోజకవర్గంఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాసులు వారికి పార్టీ కండవ కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్డీయే కూటమి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్నారు. పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి చంద్రబాబుతోనే సాధ్యం అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాల రాజు ఎన్నికల గుర్తు గాజు గ్లాసు, టిడిపి ఏలూరు పార్లమెంటు అభ్యర్ధి పుట్టా మహేష్ కుమార్ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయుడు రామకృష్ణారావు గౌడ్, బొంతు సత్యనారాయణ, పిన్నమనేని మురళి,వెలిది నాగబాబు, గుమ్మళ్ళ బాలరాజు, గుండు శ్రీనివాసరావు, బివి శ్రీనివాస రావు, బండి శ్రీనివాస రావు,చిలకా బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

