యనమల దివ్య కు బ్రహ్మరధం
తుని
సీనియర్ నేత మోతుకూరి వెంకటేష్ ఇలాకాలో తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ యనమల దివ్య కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న మోతుకూరి వెంకటేష్, తెలుగుదేశం పార్టీకి అఖండ విజయాన్ని అందించి, పార్టీకి పునర్వైభం తెచ్చేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వెంకటేష్ ఇవాళ తన సొంత ఇలాకా తుని పట్నంలోని 30 వార్డులో మీ ఇంటికి మీ ఇంటికి మీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమంలో భాగంగా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం జనసేన కార్యకర్తలతో ఇక్కడికి విచ్చేసిన యనమల దివ్య కు 30 వ వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ఇంటింటికి వెళ్లిన దివ్యకు మహిళలు మంగళహారతులతో విజయీభవా అంటూ ఆశీర్వదించారు. అనంతరం ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న యనమల దివ్య బాబు ష్యూరిటి భవిష్యత్తుకు గ్యారెంటీ ద్వారా తెలుగుదేశం పార్టీ అమలు చేసే సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాబోయేది తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వమని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు శరవేగంగా అమలు చేస్తామన్నారు. వైకాపా పాలనలో అభివృద్ధి కాను చూపు మేరలో కనిపించలేదన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పోల్నాటి శేషగిరిరావు సుర్ల లోవరాజు, యనమల శివరామకృష్ణ,జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, మల్ల గణేష్, కుక్కుడపు బాలాజీ దిబ్బ శ్రీను, అప్పన రమేష్, వంగలపూడి బుజ్జి, పోతల రాంబాబు, జక్కాన రామనాయుడు, రామచంద్ర రాజు, కుచ్చర్లపాటి అరవింద్ వర్మ, అల్లు రాజు, మామిడి దాసు, పృధ్వీ, దంతులూరి శ్రీనివాసరాజు , గొర్లి సాయిబాబా, పూడి సత్యవేణి తదితరులు పాల్గొన్నారు