కనిగిరి :దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మైనారిటీల సంక్షేమానికి ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన కుమారుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రెండడుగులు ముందుకు వేసి మైనారిటీ వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా పని చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాలు అర్హులైన మైనారిటీ కుటుంబాలకు అందించడం జరిగింది అని అందుకే మన యోగక్షేమాలకు పాటు పడే జగనన్నను మరలా గెలిపించుకోవాలని అని అన్నారు. జగనన్న మాట విని కందుకూరు నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేస్తున్నాను ఓటు వేసి నన్ను ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ అందించాలని కోరుతూ స్థానిక 4వ సచివాలయం పరిధిలో ఉన్న 6వ వార్డు కోటకట్ట రోడ్డు లో బుర్రా మధుసూదన్ యాదవ్ దంపతులు ఇంటి ఇంటికి వెళ్ళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లిం కమ్యూనిటీలు నాయకులు జామీయా మసీద్ వద్దకు ఎదురేగి బుర్రా దంపతులకు గజమాలతో స్వాగతం పలికారు .

ఈకార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ జె సి యస్ కో ఆర్డినేటర్ ముప్పవరపు కిషోర్ రాష్ట్ర నాయకులు గణేషం గంగిరెడ్డి జిల్లా నాయకులు డిసిహెచ్ మాలకొండయ్య రేణమాల అయ్యన్న సచివాలయం కన్వీనర్లు షేక్ షాహుల్ హమీద్, సయ్యద్ నషీర్, తలపనేని గోపి, సయ్యద్ నయీం బాషా, పి.వెంకట రమణయ్య, తలారి ప్రసన్న కుమారి, షేక్ రహీం, కందగడ్ల వెంకటేశ్వర్లు ,షేక్ హారూన్ ,రేణమాల మహేష్, జంగిలి యేసోబు, ఉచ్చులూరి రవీంద్ర, తొడల ఆదాము, పల్నాటి చెన్నయ్య , మొగల్ ఖాలేషా బేగ్, షేక్ అన్వర్ బాషా, సయ్యద్ అబ్దుల్ రజాక్, షేక్ జానీ బాషా, షేక్ గౌస్, షేక్ మతీనా,ఈశ్వరమ్మ, కామాక్షి నాయుడు, దేవరకొండ ఆదిలక్ష్మి, ధరణీ, రేఖ, లక్ష్మి కాంతం,సరళ, మస్తానమ్మ, శ్రీరామ కుమార్ స్వామి ఆలూరి సుందర రావు తదితరులు పాల్గొన్నారు.

పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు, మహిళలు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఘన స్వాగతం పలుకుతూ పూల వర్షం కురిపిస్తూ బాణాసంచా కాల్చి ఘనస్వాగతం పలికారు.
