Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలుమేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు : అంబటి రాంబాబు

మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు : అంబటి రాంబాబు

అమరావతి:అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ లపై విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు. సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారని అన్నారు. పవన్ ను నమ్ముకుంటే కుక్క తోక పట్టుకుని సముద్రాన్ని ఈదినట్టేనని చెప్పారు. జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా మేల్కోవాలని అన్నారు. జగన్ హామీలపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తున్నారని … ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని అన్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా చరిత్రలో జగన్ నిలిచిపోతారని అన్నారు. దుష్ట చతుష్టయం పన్నే పద్మ వ్యూహాలను ఛేదించి రాగల అర్జునుడు జగనేనని అంబటి అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article