జగ్గంపేట
గోకవరం మండలం రంప యర్రంపాలెంనకు చెందిన యువకులు మరణ వార్తతో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైనది. గ్రామంలో ప్రతీ హృదయం తలడిల్లిపోయింది. పోస్టుమార్టం పూర్తయిన పార్థివదేహలను సోమవారం గ్రామానికి తీసుకురావడం జరిగింది. మృతుల కుటుంబాలకు తెలుగుదేశం నాయకులు సంతాపం తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ అప్పలరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాకర వీర వెంకట అర్జున్,లావేటి రామన్ జి, అండుబోయిన దేవిచరణ్ ల తల్లిదండ్రుల పుత్ర శాకం చూస్తుంటే మనస్సు చలించిపోయిందని, ఎదిగిన కొడుకు అండగా ఉంటాడనుకొని కొండంత ధైర్యం తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఉంటారని కళ్ళముందే పిల్లలు భౌతిక దేహంగా మారిపోతే ఆ తల్లి తండ్రి యొక్క హృదయ వేదన వర్ణించలేనిదని అప్పలరాజు అన్నారు. నా కుటుంబంలోని కూడా ఇటువంటి సంఘటన జరిగిందని, ఆ బాధ వేదన ఎలా ఉంటుందో నాకు బాగా తెలిసినని అప్పలరాజు అన్నారు. ఎక్కడ ఏ ఆపద జరిగినా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, జగ్గంపేట మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముందుంటారని, శివుని కుంభమేళ సహిత రుద్రాభిషేక కార్యక్రమంలో ఉండడం వలన ఓదార్పుగా మమ్ములను ఇక్కడికి పంపించడం జరిగిందని అప్పలరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మంగ రౌతు రామకృష్ణ, టిడిపి రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి ఉంగరాల రాము, రాష్ట్ర రైతు ఉపాధ్యక్షులు అడపా భరత్ కుమార్, దాసరి తమ్మనదొర, సొసైటీ మాజీ చైర్మన్ గాజింగం సత్తిబాబు, మాజీ జెడ్పిటిసి పాలూరి బోసిబాబు, మండల ప్రధాన కార్యదర్శి నలమహారాజు, నియోజవర్గ ఐ టి డి పి చాంపియన్ ఉంగరాలు గణేష్,నారా ప్రసాద్, బాదంపూడి ప్రకాష్, మండల టిడిపి మీడియా కోఆర్డినేటర్ కొంగరపు రాజు, నవనాసి గణపతి, పప్పు బుజ్జి, గంటా రామచంద్రరావు,యర్రా రాంబాబు, కసిరెడ్డి రవి తదితరులు పాల్గొన్నారు.