గండేపల్లి .
గండేపల్లి మండలం మురారి లో వైసీపీకి కోల్కోలేని భారీ షాక్ తగిలింది. జగ్గంపేట నియోజకవర్గ వైయస్సార్ పార్టీ యూత్ ప్రెసిడెంట్, మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్, సర్పంచ్ కుక్కల ఆనంద్ బాబు, పలువురు వార్డు సభ్యులతో పాటు గ్రామంలో సుమారు 1000 మంది వైయస్సార్ పార్టీ నుంచి టిడిపిలో చేరారు. వీరందరికీ నెహ్రూ, నవీన్ లు పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ముందుగా జ్యోతుల నెహ్రూ కు భారీ ఊరేగింపుగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కేరళ వాయిద్యాలతో, బాణాసంచా కాల్పులతో, తీన్ మార్ డప్పులతో, భారీ ఊరేగింపుగా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సుంకవల్లి రాజు ఇంటి వద్దకు చేరుకుని పాత టిడిపి కేడర్ తో కలసి వెళ్లారు. మహిళల మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్, కందుల కొండయ్య దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామస్తులు నెహ్రూ, నవీన్, వసంత్ లకు గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వసంత్ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా పనిచేస్తానని,గ్రామానికి కావలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ వసంత్ పార్టీలో చేరడం పార్టీ గెలుపుకు శుభ సూచకమనీ, వసంత్ ఆధ్వర్యంలో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కోర్పు లచ్చయ్య దొర, ఎస్వీఎస్ అప్పలరాజు, పోతుల మోహనరావు, సుంకవల్లి రాజు, మారిశెట్టి భద్రం, అడబాల భాస్కరరావు, కందుల చిట్టిబాబు, కోర్పు సాయి తేజ, ఆళ్ల గోవిందు, బొల్లం రెడ్డి రామకృష్ణ,యర్రంశెట్టి బాబ్జి, జీను మణి బాబు, అడబాల ఆంజనేయులు, గద్దె అబ్బన్న, గోరజాల వెంకన్న దొర, ఉండవల్లి బుల్లియ,మన్యం ప్రసాదు, దాసరి ధన, కొత్త కొండబాబు,తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.