ముదిగుబ్బ
ముదిగుబ్బ మండలానికి నూతన మండల పరిషత్ అధికారిగా జినాగశేషరెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల నిబంధనలో భాగంగా ఇక్కడ పనిచేస్తున్న కవిరాజు చిత్తూరు జిల్లాకు బదిలీకాగా ఇక్కడికి కర్నూలుజిల్లా ఎమ్మిగనూరు డివిజన్నుండి నాగశేషారెడ్డి బదిలీపై వచ్చినట్లు తెలిపారు. మండలంలో ప్రజలకు మౌలిక వసతులతో పాటు వేసవిదృష్ట్యా తాగునీటి సమస్యలపై వెంటనే స్పందించాలని సిబ్బందికి సూచించినట్లు చెప్పారు. ఈసందర్భంగా మండలంలో పనిచేస్తున్న పలుశాఖల అధికారులతో పాటు జడ్పిటిసి తిరుమలసేవేనాయక్, పలువురు సర్పంచులు ఎంపీటీసీలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.