ముద్దనూరు: స్థానిక పోలీస్ స్టేషన్ లో మంగళవారం మిస్సింగ్ కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు మండల పరిధిలోని ఉప్పులూరు గ్రామానికి చెందిన గౌకనపల్లె ఉమాపతి రెడ్డి, (29) ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయములో మోటార్ సైకిల్ పై వెళ్లి తర్వాత కనిపించలేదన్నారు. అలాగే తండ్రి వెంకటసుబ్బారెడ్డి తదితర కుటుంబ సభ్యులు తమ బంధువుల గ్రామాలలో గత రెండు రోజులుగా విచారించి, ఉమాపతి రెడ్డి, కనిపించకపోవడంతో మంగళవారం పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వడంతో, సీఐ దస్తగిరి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

