చిరుధాన్యాలు తినండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి
పులివెందుల టౌన్ పులివెందుల పట్టణంలో రెండవసారి చిరుధాన్యాల ఫుడ్ సెంటర్ ను అంబకపల్లె రోడ్డు లోనిరాణి తోపులో అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవాన్ని నిర్వాహకులు ప్రకాష్ ఘనంగా ఈ నెల 10 11వ తేదీలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాలతో చేసిన టిఫిన్, భోజనం, స్వీట్లు , స్నాక్స్, పానీయాలు ఎంతోరుచిగా ఉంటాయని పలువురు పెద్దలు గతంలో వ్యాఖ్యానించారన్నారు. కాలానుగుణంగా వస్తున్న రోగాలకు షుగర్, బీపీ,వంటివి తగ్గించుకునేందుకు ఈఆహార పదార్థాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. అధిక బరువును తగ్గించుకునేందుకు కూడా ఈ పదార్థాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ టెక్నాలజీ కాలములో ఎవరి పనిలో వారు బిజీగా ఉండడంతో చిరుధాన్యాలతో చేసుకున్న తిండ్లు తినలేక పోతున్నారని, ఈ ఫుడ్డు కోర్టులో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాగి ఇడ్లీ, ఆరికలపొంగలి, రాగి పూరి, అంబలి, జొన్న కారాలు, రాగి కారాయిలు, జొన్నఅప్పలాలు, రాణి తోపులోనీఫుడ్ కోర్ట్ లో ప్రజలకు అందుబాటులో పెట్టామన్నారు. పూర్వం మన పెద్దలు ఇలాంటి తిండి తిని వందసంవత్సరాలు పైన బ్రతికినవారు ఇంకా ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రతిఒక్కరు మారి ఇలాంటి ఆరపదార్థాలు అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతోమేలు జరుగుతుందన్నారు. ఇప్పటికే పట్టణంలోనే చాలామంది నాయకులు ప్రజలు ఉదయం పూట టిఫిన్ కు వస్తున్నారన్నారు. ఈనెల 10 ,11 తేదీలలో సరికొత్త రుచులతో మరోసారిమిల్లెట్స్ ఫుడ్ సెంటర్ ను పెట్టడం జరుగుతుందన్నారు. పదో తేదీ సాయంత్రంనాలుగు గంటల నుండి రాత్రి 8 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పట్టణంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.