పార్టీలోకి సాదరంగా స్వాగతించిన జ్యోతుల నెహ్రూ
జగ్గంపేట
జగ్గంపేట మండలం మావిడాడ గ్రామంలో గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దళితులు, దళిత మహిళలు 150 మంది వైసిపికి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ టిడిపి కండువాలు వేసిన జ్యోతుల నెహ్రూ. ముందుగా అంబేద్కర్ కాలనీలో చీరలపై నడిపించి నెహ్రూ కు ఘన స్వాగతం అందించిన దళితులు, దళిత మహిళలు అనంతరం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సంక్షేమ ప్రభుత్వానికి ప్రతి ఓట్లు వేసి గెలిపించాలని చంద్రబాబు ఇప్పుడు ఇచ్చే పథకాలతో పాటు సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుందని అన్ని రకాలుగా రాష్ట్ర ప్రజలను మోసం చేసిన జగన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పాలని ఉన్నారు. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, దీపం పధకం ద్వారా ఏడాదికి ఉచితంగా 3 సిలిండర్లు, ఇంటింటికీ మంచినీరు పధకం, మహిళలకు ఉచిత బస్సు, అదేవిధంగా యువగళంనిధి ద్వారా నిరుద్యోగ భృతి ఏడాదికి మూడు వేల రూపాయలు అందించే వివరాలను, అన్నదాత పథకం కింద రైతులకు ఏడాదికి ఇచ్చే 20వేల రూపాయలను అందిస్తుందన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా బీసీ చట్టాన్ని రూపొందించి బీసీలకు ప్రత్యేక చట్టం ద్వారా తెదేపా ప్రభుత్వం బీసీలకు అండగా నిలబడుతుందనిఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, ఎంపీటీసీ వేగి రామకృష్ణ ,బస్వా చిన్న బాబు, కుంచే తాతాజీ దాపర్తి సీతారామయ్య, బద్ది సురేష్, పెంటకోట సత్యనారాయణ, బొడ్డేటి సుమన్, దేశెట్టి శ్రీను, దేవర కృష్ణ, దెయ్యాల పార్వతి, సుందరపు నాగు, రాజమహేంద్రవరపు బుజ్జి, తదితరులు పాల్గొన్నారు.

