పులివెందుల
మానవతా సేవలు మరింత విస్తృతం చేయాలని మున్సిపల్ చైర్మన్ డా. వల్లెపు వరప్రసాద్ అన్నా రు.ఆదివారం స్థానిక పెన్షనర్స్ భవనంలో సంస్థ కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధు లుగా మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మైనింగ్ యజమాని గువ్వల గంగాధర, ఎస్సీ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ యజమాని సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కౌన్సిలర్ కిషోర్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతీ,యువకులకు సంస్థ సభ్యులు తగిన అవగాహన కల్పిస్తూ పరిశుభ్రత ను కాపాడటంలో భాగస్వాములు కావాలన్నారు. యువతకు ఆదర్శంగా నిలవాలని ఆకాక్షించారు. సంస్థకు తమ వంతు సహాయ సహకారాలు అంది స్తామని వారు తెలిపారు. మానవతాసంస్థ పంపిణీ చేసే బ్యాగుల బ్యాగుల తయారీ వ్యయాన్ని తాము భరిస్తామని సారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం వారు మానవతా డైరీ లను ఆవిష్కరించారు .ఈ సందర్భంగా కృష్ణారెడ్డి అల్పాహార విందును ఏర్పాటు చేశారు.ఈ కార్యక్ర మంలో చైర్మన్ డివి కొండారెడ్డి,అధ్యక్షులు చంద్రశే ఖర్ రెడ్డి, పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు గోపాల్ రెడ్డి, విశ్రాంత అధ్యాపకుడు చంద్రశేఖర్ రెడ్డి,సభ్యులు కృష్ణారెడ్డి,హరిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.