Monday, November 17, 2025

Creating liberating content

తాజా వార్తలుమానవ తప్పిదాల వల్లే అధిక ప్రమాదాలు

మానవ తప్పిదాల వల్లే అధిక ప్రమాదాలు

బుట్టాయిగూడెం. (జంగారెడ్డిగూడెం)
మానవ తప్పిదాల వల్లే అధికంగా ప్రమాదాలు సంభవిస్తున్నాయని జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రాజేష్ అన్నారు.
స్థానిక ఆర్టీసీ డిపో గ్యారేజ్ నందు ఆర్టీసీ భద్రతా మాసోత్సవాలలో భాగంగా డ్రైవర్లకు, కండక్టర్లకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ పి.రాజేష్ మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు ఎక్కే ప్రజలను ఎంతో నేర్పుతో, ఓర్పుతో తమ గమ్యస్థానాలకు తీసుకువెళ్లే బాధ్యత ఆర్టీసి డ్రైవర్లపై ఉందని అన్నారు.
మద్యం సేవించి బస్సు నడిపినా, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేసినా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. స్థానిక డిపో మేనేజర్ పి.పి.వి.గంగాధర రావు మాట్లాడుతూ ప్రతీ సంవత్సరం ఆర్టీసి భద్రతా వారోత్సవాలు జరిగేవని, ఈ సంవత్సరం భద్రతా మాసొత్సవాలుగా మార్చినట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 95 శాతం రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని అన్నారు.
చాలా మంది ఆర్టీసి డ్రైవర్ లకు శారీరక, మానసిక ఒత్తిడి వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, డ్యూటీ ఎక్కిన 10 గంటల తరవాతనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతీ డ్రైవర్ కి డ్యూటీ తర్వాత విశ్రాంతి అవసరమని, విశ్రాంతి లేకుండా డ్యూటీ చేయరాదని సూచించారు. మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని అన్నారు. 2024 -2025 సంవత్సరంలో ప్రమాదాల శాతం సున్నా ఉండేలా కృషి చేయాలని కోరారు.
కార్యక్రమం అనంతరం సిఐ రాజేష్ ను డిపో మేనేజర్ గంగాధరరావు దుశ్శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో డిపో ఎ.ఎం.టి వరలక్ష్మి, మెకానికల్ ఫోర్మెన్ కేశవ కుమార్, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article