ప్రజాభూమి, ముదిగుబ్బ
సోమవారం అయోధ్యలో రామాలయంనందు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఎక్కడ మాంసాహారం వాడకూడదంటూ పలు గ్రామాల్లో ఆదివారం టామ్ టామ్ వేయడం జరిగింది.
ఇప్పటికే పలురాష్ట్రాల్లో 22న ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటిస్తూ మాంసాహారంతోపాటు మద్యనిషేధం జరిగిందని మనగ్రామంలో పూర్తిస్థాయిలో మద్యం, మాంసాహారం స్వచ్ఛంగా నిషేధించుకొని భక్తిశ్రద్ధలతో ఆలయాల్లో ప్రత్యేకశుభ్రత పాటిస్తూ భజనలు నిర్వహించాలని విశ్వహిందూపరిషత్, సమరసత సేవాఫౌండేషన్ నిర్వాహకులు గ్రామాలలో ప్రజలకు పిలుపునిచ్చారు.