చంద్రగిరి:
చంద్రగిరి మండలం లోని చంద్రగిరి వైఎస్ఆర్ మహిళా మార్ట్ లో విక్లీ వన్డే ప్రకృతి వ్యసాయ ఉత్పత్తుల స్టాల్ ను తిరుపతి జిల్లా ప్రకృతి వ్యసాయం విభాగం డిపిఎం ఏ.షణ్ముగం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ఆయనమాట్లాడుతూ మహిళా మార్ట్ లో వస్తువులు కొనుగోలు చేసి, ఇక్కడే వారికీ కావలసిన
కూరగాయలు, ఆకు కూరలు కూడా మార్ట్ వద్దే కొనుగోలు చేసే విధంగా ఇక్కడ స్టాల్ ను ఏర్పాటు చెయ్యడం జరిగిందని వివరించారు. స్టాల్ లో ప్రకృతి వ్యసాయ పద్దతిలో పండించిన ఆకు కూరలు- గోంగూర, చుక్కకూర, సిర్రకు, మెంతికూర, కొత్తిమీర, గురిగాకు, మునగాకు, కూరగాయలు – చిక్కుడు, బెండ, వంగ, టమోటా, కూర అరటి, వీటితో పాటుగా తీగజాతి, దుంప జాతీ మొదలకు ఉత్పత్తులు ఎటువంటి రసాయనలు & పురుగుమందులు వాడకుండా పండించిన ఉత్పత్తులను ఈ స్టాల్ లో ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని వివరించారు. ప్రకృతి వ్యసాయం లో పండిన ఉత్పత్తులను మాత్రమే తీసుకోవాలని అప్పుడే అందరికి ఆహారంలో పౌష్టిక విలువలు పెరిగి ఆరోగ్యంగా ఉంటారాని సూచించారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ పద్దతిలో పండించిన ఉత్పత్తులను ప్రతి శుక్రవారం జరిగే ఈ సంతలో ఈ స్టాల్ లో వారి ఉత్పత్తులను అమ్ముకోవచ్చు అని తెలియచేయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో అడిషనల్ డిపిఎంపట్టాభి రెడ్డి,ఎస్ఆర్ పి భానుమూర్తి , ఎన్ ఎఫ్ ఏ మధు, ఎంటి శ్రీదేవి, రాగమ్మ పాల్గొనడం జరిగింది.