గండేపల్లి.
గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఫార్మసీ కళాశాల లో శుక్రవారం మహిళా ఫిర్యాదుల సదస్సు ను నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ప్రఖ్యాతమనస్తత్వవేత్త,న్యాయవాది సోనియా మడికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు మరియు వాటిని పరిష్కరించడం లక్ష్యంగా ప్రసంగించారు.మహిళలు సవాళ్లను అధిగమించడానికి మరియు వారి హక్కులను పొందడానికి సహాయపడటానికి ఆచరణాత్మక మార్గదర్శనం,వ్యూహాలు అందించారు.విద్యార్థినీలకు విలువైన సలహాలు అందిస్తూ, ఫిర్యాదులను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో ఆమె తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలను వివరించారు.