అర్హులందరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
హిందూపురం టౌన్
మహిళల సంక్షేమం కోసం రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని హిందూపురం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు బోయ శాంతమ్మ దీపిక మున్సిపల్ చైర్ పర్సన్ ఇంద్రజ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎంజీఎం ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో మహిళా సంఘాలకు 4వ విడత వైయస్సార్ ఆసరా వారోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ఎన్నో పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక చేయూత ఇస్తూ అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతోందన్నారు పొదుపు సంఘాల మహిళలకు బాసటగా వై.యస్.ఆర్. ఆసరా పథకం ద్వారా నాలుగో విడత 17,115 మంది లబ్ధిదారులకు రూ.13.81 కోట్ఉ వారి ఖాతాలలోకి వేయడం జరిగింద న్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు విడతలలో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక సహకారం అందించి ముఖ్యమంత్రి మాట నిలుపుకున్నారన్నారు. దీనికి తోడు అన్ని రకాల సంక్షేమ పథకాలను మహిళల పేరిట మంజూరు చేస్తున్న ఘనత కూడా ముఖ్యమంత్రి జగన్ కే దక్కుతుందన్నారు. అర్హులైన వారందరూ ప్రతి సంక్షేమ పథకాన్ని సద్వినియోగం చేసుకొని వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సహకరించాలన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు పూర్తి కావాలంటే మరోసారి వైకాపా ప్రభుత్వం అవసరం ఉందన్నారు మహిళలను రాజకీయంగా కూడా ఉన్నత స్థితికి చేర్చాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ హిందూపురం పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాలకు మహిళలను ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా అవకాశం ఇవ్వడం జరిగిందని, ఎన్నికల్లో తమను గెలిపించాలని శాంతమ్మ , దీపికలు కోరారు. అనంతరం పట్టణంలోని 17,115 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు మంజూరైన రూ. 13.81 కోట్ల YSR ఆసరాకు సంబంధించిన మెగా చెక్కును విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బలరామిరెడ్డి, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి,మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి, వైయస్సార్సీపి నాయకురాలు మధుమతి రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి,తదితర కౌన్సిలర్లు, వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మెప్మా సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.