తలైవా రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్ గా కీలకపాత్ర పోషించిన చిత్రం లాల్ సలామ్. ఇందులో ఆయన మోడ్రన్ భాయ్ తరహాలో అలరించనున్నారు. లాల్ సలామ్ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్, అనంతిక తదితరులు నటించారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ కూడా నటించడం ఓ ముఖ్య ఆకర్షణ కానుంది. విడుదల తేదీ దగ్గరపడడంతో లాల్ సలామ్ ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.