కడప సిటీ
గురువారం 8ఏఐటియుసి కడప జిల్లా కార్యదర్శి ఉద్దె.మద్దిలేటి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై కడప డీఈవో అనురాధకువినతిపత్రంఇవ్వడంజరిగింది.
కడప నగరంలో ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధ జిల్లా సమితి ఆధ్వర్యంలో డీఈఓ అనురాధ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు కామాక్షమ్మ మాట్లాడుతూ
గత 20సం||ల నుండి ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామీణప్రాంతాలలో ఉన్నపేదవిద్యార్థులకు కేంద్రప్రభుత్వంస్కీముల్లోబాగంగామధ్యాహ్నభోజనం వండి పిల్లలకు అన్నంపెట్టే కార్యక్రమం 2003 నవంబరు 1వ తేదీన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభించినప్పటినుండి అన్నం వండి విద్యార్థులకుపెడుతున్నాం. అప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కీము వర్కర్లు గానే పనిచేయించుకొంటున్నారే తప్పా ! కనీసం కార్మికులుగా కూడా గుర్తించడంలేదు. ప్రభుత్వాలుమారినప్పుడల్లా పిల్లలకు పెట్టే ఆహారంలో (మెనూ) మార్పులు చేస్తుంటారు. మార్చినపుడల్లా కార్మికులపైవిపరీతంగాఖర్చుభారంఅవుతుంది.దీనిపైయూనియన్లు పోరాటం రూపంలో అడిగితే పైసల్ రూపంలో పెంచుతున్నారే తప్పా రూపాయి రూపంలో యీ 20సంలలోపెంచడం ఎప్పుడూ జరగలేదు అన్నారు. దీనికి తోడు మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టు అన్న సందంగా మన రాష్ట్ర ప్రభుత్వం 2023నుండిఉదయం పూట, విద్యార్థులకు రాగిజావప్రకటించింది.దీనికి ప్రత్యేకంగా డబ్బులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికి ఇవ్వకుండా కార్మికులతో వెట్టి చాకిరిచేయించుకుంటున్నారు. మరియు కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం కూడా నెలకు ఏ ప్రభుత్వ కార్యాలయాలలో యీ జీతం ఏరాష్ట్రం కూడా అమలు చేయుటలేదు. 2006లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కీ॥శే॥ డా|| వై.యస్. రాజశేఖరరెడ్డి రూ.1000/-లు గౌరవ వేతనం అదికూడా 60:40 నిష్పత్తి ప్రకారం గౌరవవేతనం ప్రకటించినారు. తరువాత 2018 ఫిబ్రవరి 4వ తేదీ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యూనియన్ నాయకులుఛలో విజయవాడ పిలుపులో బాగంగా ధర్నా చౌక్ లో ధర్నా చేసే సమయంలో రూ.1000/- ల నుండిరూ3,000/-లు జీతాన్ని పెంచియున్నారు. అప్పటి నుండి పిల్లలకు ఇప్పటి వరకు మూడు సార్లు మెనూ పెంచారు. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచలేదు న్నారు .ఇప్పటికైనా జగనన్న మాట ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 10 వేలు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఏఐటీయూసీ అనుబంధం కడప జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మేరీ జిల్లా సహాయ కార్యదర్శి పార్వతిలుతదితరులు పాల్గొన్నారు.