చంద్రగిరి:ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మతసామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ అన్నారు. గురువారం పవిత్ర రంజాన్ పర్వదినాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా గురువారం చంద్రగిరి, దామినేడు, పుదిపట్లలో ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పులివర్తి వినీల్ ఒకరికొకరు ఆలింగం చేసుకుని శుభాకాంక్షలు తెలుపారు. అనంతరం పులివర్తి వినీల్ మాట్లాడుతూ ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. ఆ అల్లా దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
