టి.నరసాపురం :మతసామరస్యానికి ప్రత్యేక రంజాన్ హిందూ ముస్లిం క్రైస్తవ సోదర భావాన్ని దేశభక్తిని పెంపొందించే విధంగా రంజాన్ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు అన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి రంజాన్ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషకరమని ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా నిరుపేదల ఆకలిని అర్థం చేసుకొని వారికి సహాయ పడటం ఎంతో సంతృప్తినిచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం అని కొనియాడారు,రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు సుఖ సంతోషాలను కలుగజేయాలని అల్లాను ప్రార్థిస్తున్నానని తెలిపారు, గురువారం ఈద్-ఉల్-ఫితర్ ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా తమ అనుచరులతో ప్రజా ప్రతినిధులతో ఇస్లాం సంప్రదాయాన్ని గౌరవిస్తూ టీ నర్సాపురం లోని మజీద్ ఈ హుదా మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని అనంతరం ముస్లిం సోదరులను అలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు, వారితో కొద్దిసేపు ముచ్చటించారు,ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గోరుముచ్చు గోపాల్ యాదవ్,దేవరపల్లి ముత్తయ్య, మోదుగు సునంద,వాసిరెడ్డి మధు, దేవరపల్లి సీతారామయ్య, శ్రీనివాసరాజు, కన్నం సర్వేశ్వరరావు, కటకం మల్లయ్య,కొరివి వెంకటేశ్వర్లు, జి రవితేజ, రంగబాబు, రంగ, మాదంశెట్టి మల్లయ్య, శ్రీనివాస్, నార్లపాటి వెంకటరావు, చిన్నం ఏసోబు, దుర్గారావు,తదితరులు పాల్గొన్నారు.
