లేపాక్షి:
మండల పరిధిలోని టోల్గేట్ సమీపంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ నారాయణస్వామి, మాజీ శాసనసభ్యులు అబ్దుల్ ఘని, లే పార్టీ సర్పంచ్ ఆదినారాయణ, తదితరులు కలిసి పుష్పగుచ్చా లను అందజేసి అభినందించారు. మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరు నుండి మడకశిరకు వెళుతున్న సమయంలో చోళ సముద్రం టోల్గేట్ వద్ద మంత్రిని కలసి పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ గౌడ్ మండల ఉపాధ్యక్షురాలు లీలావతి లతోపాటు అధిక సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.