లేపాక్షి: మండల పరిధిలోని పంచాయితీ గ్రామాల పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా మండల కన్వీనర్ నారాయణస్వామి , మండల ఉపాధ్యక్షులు ఆంజన రెడ్డి తదితరులు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచారన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందజేయడం జరిగిందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని వారు కోరారు. అదేవిధంగా హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి దీపికా వేణు, పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మలను ఓటుతో ఆశీర్వదించాలని వారు కోరారు. చోళ సముద్రంలో జరిగిన కార్యక్రమంలో కన్వీనర్ నారాయణస్వామి తో పాటు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. అదేవిధంగా బింగి పల్లి పల్లి లో జరిగిన ప్రచార కార్యక్రమం లో మండల ఉపాధ్యక్షులు ఆంజన రెడ్డి, సర్పంచ్ ఆదినారాయణ, నాయకులు సయ్యద్ నిసార్ అహమద్, అంగడి రామంజి, ఆదినారాయణ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ప్రసాద్, అన్సార్ ,ఇర్ఫాన్, ముజ్జు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా కల్లూరు, కొండూరు, మానేపల్లి, పులమతి, తదితర గ్రామంలో విస్తృతంగా వైకాపా నాయకులు, కార్యకర్తలు అసెంబ్లీ అభ్యర్థి దీపికను, పార్లమెంట్ అభ్యర్థి బోయ శాంతమ్మలను గెలిపించాలని వారు ప్రజలను కోరారు.


