విశాఖ పశ్చిమ

91 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు.సోమవారం ఉదయం 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి నానాజీ ఆధ్వర్యంలో ఆశవాణి పాలెం లోని రాజీవ్ గృహకల్ప నివాస సముదాయాలకు 29 లక్షల రూపాయలతో నిర్మించిన మంచినీటి పైపులైను నిర్మాణాన్ని శిలాఫలకం ఆవిష్కరించి వైయస్సార్సీపి పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ప్రారంభించారుఅదేవిధంగ 91 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారుఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు మంచినీటి కష్టాలు పడకుండా ఉండాలనే లక్ష్యంతో మంచినీటి పైపులైను నిర్మించడం జరిగిందన్నారు.విద్య వైద్య ఆరోగ్యం రంగాలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు.నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు కనిపించడం జరిగిందని ఇంకా మిగిలి ఉన్న పనులు కూడా త్వరలో పూర్తి చేయడం జరుగుతుందని ప్రజలకు స్పష్టం చేశారు.అవినీతికి పరాకాష్ట చంద్రబాబునాయుడు అని ఆయన విమర్శించారు.ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే గెలిపిస్తే అభివృద్ధి ఏంటనేది చూపిస్తానని ఆయన అన్నారు.అనంతరం ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లును ప్రశంస పత్రాలు అందించిసత్కరించారు.ఈకార్యక్రమంలోవార్డ్ అధ్యక్షులు పిన్నింటి అప్పలరాజు, ఇన్చార్జి సిహెచ్ శ్రీనివాసరావు ,క్లస్టర్ ఇంచార్జ్ పల్ల ఎర్ని కుమార్, బాకీ శ్యాం కుమార్ రెడ్డి, సచివాలయ కన్వీనర్లు , రాము ,దశావతారం, బుజ్జమ్మ, నీలవేణి , ఎర్రన్న, చిన్నం నాయుడు, భోగేశు, రాజు యాదవ్, సుధాకర్, సూర్యనారాయణ, ఆర్పీలు , మంగా, నాగమణి, సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు, గృహసారథులు, పార్టీ కార్యకర్తలు ,గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
